26.8 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

మహా కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ

రెండేళ్ల తరువాత జరిగే గోదావరి పుష్కరాల్లో కోసం… కుంభమేళాలో చేసిన ఏర్పాట్లను అధ్యయనం చెయ్యడానికి మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ బృదం ప్రయాగరాజ్‌లో పర్యటిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 60 కోట్ల మంది హాజరైన కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌ యోగి ఆదిత్యనాద్‌ ప్రభుత్వం ప్రయోగ్‌రాజ్‌లో చేసిన ఏర్పాట్లును మంత్రి నారాయణ బృందం పరిశీలించింది. కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనం చేయడం ద్వారా 2027లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసమే మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అధికారుల బృందం రెండు రోజుల పాటు ప్రయోగ్‌రాజ్‌లో పర్యటిస్తోంది. సోమవారం ప్రయోగ్‌రాజ్‌ చేరుకున్న నారాయణ బృందానికి ఉత్తర ప్రదేశ్‌ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చి కుంభమేలా ఏర్పాట్లను వివరించారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్‌ నియంత్రణ, రవాణా సౌకర్యాలు, పారిశుద్ధ్యం, స్నానాల కోసం ఘాట్ల వద్ద చేసిన ఏర్పాట్లు, ఘాట్ల నిర్మాణం, భద్రతా చర్యలపై మంత్రి నారాయణ బృందం ఈ పర్యటనలో అధ్యయనం చేస్తోంది. మంగళవారం కుంభమేళా జరుగుతున్న త్రివేణి సంగమంతో పాటు పలు సెక్టార్‌లలో యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను మంత్రి బృందం స్వయంగా పర్యటించి పరిశీలించారు. అనంతరం మహాకుంభమేళా అధారిటీ కార్యాలయంలో మంత్రి నారాయణ అధికారులతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో మంత్రి పొంగూరు నారాయణ వెంట మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ సంపత్‌ కుమార్‌, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమీషనర్‌ కేతన్‌ గార్గ్‌లు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com