31.8 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

సీఎం చంద్రబాబు సీపీఆర్ఓగా ఆలూరి రమేష్ నియామకం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా సీనియర్ జర్నలిస్టు ఆలూరి రమేష్ నియామకమయ్యారు. ఈ మేరకు సాధరణ పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియామకం జూన్ 13, 2024 నుండి అమలులో ఉన్నట్టు భావించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. పదవీకాలం, పే కు సంభందించిన వివరాలను తెలియజేస్తే మరో ఉత్తర్వు ఇవ్వనున్నారు. జీవో ఆర్టీ నెంబర్ 393ను జరీ చేసిన జిఏడి పోలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్‌ కుమార్ మీనా…తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సీపీఆర్ఓగా కొనసాగుతారని పేర్కొన్నారు.

జర్నలిస్టుగా ఆంధ్రజ్యోతి పత్రికలో వివిధ హోదాల్లో ఆలూరి రమేష్ బాధ్యతలు నిర్వహించారు. మహాన్యూస్, ఎన్ టివిలో రిపోర్టర్ గా వివిధ హోదాల్లో  పనిచేశారు. 2019 నుంచి టిడిపి పార్టీ మీడియా వ్యవహారాల ఇంచార్జిగా చేస్తున్నారు. జర్నలిస్టుగా సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలు చూసిన అనుభవం అలూరి రమేష్ కి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన కాలం నుంచి రమేష్ ముఖ్యమంత్రి కార్యాలయం వార్తలు కవర్ చేసేవారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com