27.2 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

భారత్ లో తగ్గిన ఆత్మహత్యల రేటు

భారతదేశంలో ఆత్మహత్యల మరణాల రేటు 30 శాతానికి పైగా తగ్గిందని ది లాన్సెట్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధ్యయనం తాజాగా వెల్లడించింది. ఆత్మహత్య మరణాల రేటు 1990లో లక్ష జనాభాకు 18.9గా ఉండేదని పేర్కొంది. అయితే 2019లో అది లక్ష జనాభాకు 13.1 శాతానికి, 2021లో లక్ష జనాభాకు 13 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. 1990 నుంచి 2021 వరకూ భారత్‌లో ఆత్మహత్యల మరణాల రేటు 31.5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.లాన్సెట్‌ అధ్యయనం ప్రకారం.. ఆత్మహత్యల ద్వారా మరణాల రేటు తగ్గడం మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువగా కనిపించింది. 1990లో స్త్రీలలో ఆత్మహత్య మరణాల రేటు లక్ష జనాభాకు 16·8 శాతంగా ఉండగా.. అది 2021లో లక్ష జనాభాకు 10·3 శాతానికి తగ్గింది. ఇక 1990లో పురుషుల ఆత్మహత్యల రేటు లక్ష జనాభాకు 20.9 శాతంగా ఉంది. 2021 నాటికి అది లక్ష జనాభాకు 15.7కు తగ్గింది.

2020లో భారతదేశంలో అత్యధిక ఆత్మహత్యల మరణాల రేటు విద్యావంతులైన మహిళల్లోనే కనిపించింది. ఇందుకు కారణం కుటుంబ సమస్యలే’ అని యూఎస్‌ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ పరిశోధకులు తెలిపారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 7,40,000 ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. అంటే సగటున ప్రతి 43 సెకన్లకు ఒకరు సూసైడ్‌ చేసుకుంటున్నారన్నమాట. గత మూడు దశాబ్దాల్లో వయస్సు- ప్రామాణిక మరణాల రేటు దాదాపు 40 శాతానికి తగ్గింది. లక్ష జనాభాకు 15 మరణాల నుంచి లక్ష జనాభాకు 9 మరణాలకు చేరింది. ఇందులో ఆడవారిలో మరణాల రేటు 50 శాతానికి క్షీణించగా.. పురుషుల్లో 34 శాతానికి తగ్గింది. మొత్తం మీద ఆత్మహత్యల మరణాల రేటు మగవారిలో లక్ష జనాభాకు 12.8 శాతంగా, స్త్రీలలో లక్ష జనాభాకు 5.4 శాతంగా ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com