30.7 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

రాజ్యసభకు నాగబాబు… బీజేపీ డ్రాప్

ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు మరో మూడున్నర ఏళ్ల రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఏపీ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. కచ్చితంగా ఈ సీటు కూటమికి దక్కుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో.. కూటమికి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈ సీటు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పదవి తమ పార్టీకి కావాలని.. మూడు పార్టీల నేతలు కోరుకుంటున్నారు. ఈసారి జనసేనకు చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేయగా…. ఇందులో మస్తాన్ రావు తో పాటు మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆర్ కృష్ణయ్య బిజెపికి మద్దతు ప్రకటించారు.

దీంతో ఖాళీ అయిన మూడు స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. తొలుత కూటమిలోని మూడు పార్టీలు మూడు పదవులను సర్దుకుంటాయని అంతా భావించారు. కానీ తెలుగుదేశం పార్టీ రెండు రాజ్యసభ సీట్లు దక్కించుకోగా.. బిజెపి ఒకటి తీసుకుంది. జనసేనకు చాన్స్ లేకుండా పోయింది. టిడిపి నుంచి బీదా మస్తాన్ రావు తో పాటు సానా సతీష్ కు పదవి దక్కింది. బిజెపి నుంచి ఆర్ కృష్ణయ్య తిరిగి ఎన్నికయ్యారు. చివరి వరకు జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ జనసేనకు చాన్స్ లేకుండా పోయింది. సమీకరణలో భాగంగా నాగబాబుకు అవకాశం లేకుండా పోయిందని.. ఆయనను ఏపీ క్యాబినెట్లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు చాన్స్ ఇచ్చి.. తరువాత క్యాబినెట్ లోకి తీసుకుంటారని అంతా భావించారు.

ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. నాగబాబు కోసం బిజెపి డ్రాప్ అయ్యిందని విశ్వసనీయ సమాచారం. మారిన పరిస్థితుల నేపథ్యంలో నాగబాబును రాజ్యసభకు పంపి.. ఏపీలో మరో బిజెపి నేతకు మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం ప్రారంభమైంది. వాస్తవానికి ఏపీ మంత్రి పదవి కన్నా… రాజ్యసభకు వెళ్లాలన్నది నాగబాబు అభిప్రాయం. తొలినుంచి పెద్దల సభకు వెళ్లాలని నాగబాబు భావిస్తున్నారు. ఇప్పుడు ఏపీ బీజేపీలో మరొకరికి మంత్రి పదవి ఖాయమైనట్టేనని వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బిజెపి 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన సత్య కుమార్ యాదవ్ మంత్రి అయ్యారు. మంత్రివర్గంలో ఒక పదవి ఖాళీగా ఉంది. నాగబాబు కోసమే ఆ పదవి అంటూ ఇప్పటివరకు అంతా భావించారు. నాగబాబు.. రాజ్యసభకు వెళితే.. రాష్ట్ర మంత్రిగా బిజెపి నేతకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com