ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రేపు గుంటూరు జిల్లాలో పర్యటించ నున్నారు. బుధవారం ఉదయం తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో గుంటూరు మిర్చి యార్డ్ కు చేరుకుంటారు. అక్కడ గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులతో మాట్లాడతారు మాజీ సీఎం. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అలాగే, మిర్చి రైతుల డిమాండ్లు ఏంటో కూడా అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మిర్చి రైతులకు అండగా ఉంటుందని వాళ్లకు భరోసా కల్పిస్తారు వైఎస్ జగన్. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొననున్నారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ తిరిగి అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
- Advertisement with us -