- యూట్యూబర్ రణ్ వీర్ కు తీవ్ర మందలింపులు
- ఏది పడితే ఆ చెత్త వాగి సోషల్ మీడియాలో పెడతారా?
- చేసే వ్యాఖ్యలను సమర్ధించుకునే నైతిక హక్కు కూడా లేదు
- రణ్ వీర్ కు తలంటిన సుప్రీంకోర్టు ధర్మాసనం
- అరెస్ట్టు నుంచి తాత్కాలిక ఉపశమనం
- విచారణకు హాజరు కాకపోతే అరెస్టు తప్పదు
- రణ్వీర్ తరపు న్యాయవాదికీ అక్షింతలు
- ఈ వ్యాఖ్యలు సమాజానికి ఎంత చెడ్డవో ఆలోచించారా?
- క్రిమినల్ నేరం కిందకి రాదని వాదించిన న్యాయవాది అభినవ్
- రణ్ వీర్ పై ఇప్పటికే రూ.5 లక్షల డెత్ వారెంట్
తల్లిదండ్రులపై సెక్సువల్ జోక్స్ వేస్తూ అవమానకరంగా మాట్లాడిన అలహాబాద్ యూట్యూబర్ రణ్ వీర్ అహ్లు వాలియాను సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో మందలించింది. ఘోరాతి ఘోరమైన వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబడుతూ అరెస్టు నుంచి మాత్రం ఉపశమనం కలిగించింది. పాస్ పోర్టును సరెండర్ చేయమని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లోద్దని ఆదేశించింది. ప్రాణ హాని ఉందని, చంపుతామని బెదిరిస్తున్నారని రక్షణ కల్పించమని అహ్లువాలియా దాఖలు చేసిన పిటిషన్ పై స్సందిస్తూ, తాత్కాలికంగా అరెస్టు నుంచి ఉపశమనం కల్పించింది. భద్రత కల్పించాలని దాఖలు చేసిన పిటిషన్ పై స్పందిస్తూ మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయవద్దని, భద్రత కల్పించాలని సూచించింది.సామాజిక మాధ్యమాల్లో హాస్యం , కామెడి పేరిట తల్లి దండ్రులపై సెక్స్ జోక్సు వేయడం ఈమధ్య కాలంలో ట్రెండుగా మారిందని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ప్రోగ్రాములతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో చెప్పాలని నిలదీసింది.రణ్ వీర్ చేసిన నేరం తీవ్రమైనదే.. కానీ చంపేంత కాకపోవచ్చు. అందుకే కేసు పూర్తి విచారణ ముగిసేవరకూ అరెస్టు నుంచి, డెత్ త్రెట్స్ నుంచి భద్రత కల్పించవచ్చునని తెలిపింది.
దేశవ్యాప్తంగా సంచలనానిక, తీవ్ర చర్చకు దారితీసిన ఇండియాస్ గాట్ లాటెంట్ కామెడీ షో పైనా సుప్రీం కోర్టు ద్విసభ్య డివిజన్ బెంచ్ మండిపడింది.తదుపరి నోటీసులు అందేవరకూ రణ్ వీర్ లేదా ఆయన సహ న్యాయనిర్ణేతలు మరే ఇతర టీవీ షోలలో, కామెడీ షోలలో పాల్గొనరాదని హుకుం జారీచేసింది.సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకర కంటెంట్ నియంత్రణకు కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోందో చెప్పాలని ఆదేశించింది. ఈకేసు నుంచి తనపై ఎఫ్ ఐ ఆర్ నమోదు కాకుండా, ముందస్తు బెయిల్ కు అనుమతిస్తూ ఆదేశాలివ్వాని కోరుతూ అహ్లువాలియా దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ కోటీశ్వర సింగ్ల బెంచ్ వాదనలను వింది. అహ్లూవాలియా తరపున సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ కుమారుడు అభినవ్ చంద్రచూడ్ విచారణకు హాజరయ్యారు.
ఇది తీవ్ర నేరం కాదా? ఇదేం వాదన?
అహ్లువాలియా ను చంపేంత నేరం చేయలేదని, ఆయన చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా తప్పు పట్టాల్సిందే, శిక్షించాల్సిందే, నైతికంగా నేనూ తప్పు బడుతున్నాను..కానీ క్రిమినల్ కేసు పెట్టేంత తీవ్రమైనది కాదని భావిస్తున్నానంటూ వాదించారు. అయితే అసభ్యత నేరం కాకపోతే ఈ దేశంలో మరేది నేరం కిందకు వస్తుందని జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. అతని మైండ్ నుంచి పుట్టే చెత్త ఆలోచనలన్నింటినీ ప్రోగ్రాం పేరుతో వదులుతామంటే అనుమతించాలా అని సూటిగా ప్రశ్నించారు. అహ్లూవాలియాకు ఈ ఆలోచనలు ఎక్కడనుంచి వచ్చాయో చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు.. చాలా సమాజాల్లో సదరు కార్యక్రమాలు చిన్న పిల్లలు చూడరాదన్న డిస్ క్లెయిమర్లు కూడా వేస్తుంటారు.
పాపులర్ అయితే చెత్త వాగుడు వాగొచ్చా?
పాపులర్ అయినంత మాత్రాన నోటికెదొస్తే అది మాట్లాడి సమాజం దానిని ఆమోదించాలని అనుకోవడం చాలా తప్పని సూర్యకాంత్ అన్నారు. అహ్లూవాలియా కామెంట్లు తల్లి దండ్రులను, ఆడపిల్లలను తీవ్రంగా బాధించాయి.మీ పిటిషనర్ కామెంట్లతో యావద్దేశం తీవ్రంగా సిగ్గుపడుతోంది అంటూ న్యాయవాది అభినవ్ ను ఉద్దేశించి జడ్జి కామెంట్ చేశారు.
రణ్ వీర్ తలపై రూ.5లక్షల రివార్డు
అహ్లువాలియాకు డెత్ త్రెట్స్ వస్తున్నాయన్న పిటిషన్ పై ఈదేశంలో న్యాయవ్యవస్థ ఉంది.న్యాయం ప్రకారమే కోర్టులు పనిచేస్తాయి. హత్యా యత్నం బెదిరింపులు వస్తే చట్టం తన పని తాను చేస్తుంది. భద్రత కల్పిస్తుంది అన్నారు జడ్జి. రణ్ వీర్ కి హత్య చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఆ యూట్యూబర్ తలపై రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. తనను చంపుతామంటూ వస్తున్న బెదిరింపులపపై తాను భయ పడుతున్నట్లు తాను చేసింది తప్పేనని, తనను క్షమించాలని మరోసారి కోరాడు.విచారణకు రణ్ వీర్ రాకపోవడంతో ముంబై పోలీసులు ఇంటికి వెళ్లారు.అయితే ఇల్లు తాళం పెట్టి ఉంది. పోలీసులు పంపిన నోటీసులు అందుకున్న రణ్ వీర్ అరెస్టునుంచి ఉపశమనం కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.