రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని లాలమ్మ గార్డెన్‌లో అయ్యప్పస్వామి పడిపూజ ఉత్సవంలో పాల్గొన్నారు. బుదోళ్లు శ్రీశైలం గురుస్వామి, కౌన్సిలర్ బుదోళ్లు ముత్యాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. వారితో పాటు పూజల్లో పాల్గొన్న వాళ్లలో మణికొండ కార్పొరేటర్ రామకృష్ణారెడ్డి, నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏర్పుల కుమార్ తదితరులు ఉన్నారు.