ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3 ప్రారంభమైంది. అది కూడా అదిరిపోయేలా. గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఉమెన్స్ టీమ్. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగిందనే చెప్పాలి. ఎందుకంటే ఉమెన్స్ టీమ్ బౌలింగ్‌లో విఫలమైన.. బ్యాట్‌తో అదరగొట్టేశారు.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్.. 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఆష్లీ గార్డ్‌నర్ పరుగుల వరద పారించిందనే చెప్పాలి. 37 బాల్స్‌లో ఏకంగా 79 పరుగులు చేసింది. 8 సిక్స్‌లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది ఆష్లీ. బెత్ మూనీ కూడా 56 పరుగులతో విజృంభించడంతో భారీ స్కోర్ చేయగలిగింది గుజరాత్.
ఇక ఈ భారీ టార్గెట్‌ను చేజ్ చేయడంలో ఆర్సీబీ తడబడింది. మళ్లీ ఆష్లీనే రెండు కీలక వికెట్లు తీయడంతో 2 ఓవర్లకే షాక్ తగిలింది. స్మృతి మంధాన, డానీ వ్యాట్ వెంట వెంటనే పెవిలియన్ చేరారు. దీంతో ఎలీస్ పెర్రీ తన సత్తా చాటడం మొదలు పెట్టింది. ఓ వైపు పెర్రీ దూకుడుగా ఆడింది. కానీ రాఘవి బిస్త్ నుంచి పూర్తిగా సపోర్ట్ రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత పెర్రీ కూడా ఔట్ అవ్వడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. 42 బంతుల్ఓల 89 పరుగులు చేయాల్సి ఉండటంతో కాస్త ప్రెజర్‌లో పడింది ఆర్సీబీ. అప్పుడు క్రీజులోకి ఎంట్రీ ఇచ్చింది రిచా. అయితే క్యాచ్ డ్రాప్ కావడంతో డకౌట్‌గా వెనుదిరిగే చాన్స్ తప్పించుకుంది. ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది 16వ ఓవర్ అని చెప్పాలి. ఈ ఓవర్‌లో రిచా నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాదేసింది. ఆ తర్వాత మ్యాచ్ ఆర్సీబీవైపు టర్న్ అయ్యింది. ఆ తర్వాత తన దూకుడును ఏ మాత్రం తగ్గించలేదు. దీంతో మరో 9 బంతులు ఉండగానే మ్యాచ్‌ను ముగించేసింది ఆర్సీబీ.
ఈ మ్యాచ్ మరికొన్ని రికార్డులకు వేదికైంది. WPLలో ఇదే హైఎస్ట్ చేజింగ్ స్కోర్. అంతకుముందు గుజరాత్‌పై 191 పరుగులను ఛేదించడమే రికార్డ్‌గా ఉండేది. ఇక ఈ టోర్నీలో 200 పరుగుల మార్క్‌ను అందుకోవడం గుజరాత్‌కు ఇది రెండోసారి.