34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

మాది ఇకపై తటస్థ వైఖరి ఎంత మాత్రం కాదు…

  • రష్యా, ఉక్రెయిన్ లకు తేల్చి చెప్పిన మోడీ
  • చర్చలకు రండి.. ఇది యుద్ధకాలం కాదు
  • ఏదైనా మాట్లాడుకోడమే.. చర్చలకు కూర్చోండి
  • భారత్ అడుగులు ఎప్పుడూ శాంతి, సంయమనమే
  • ట్రంప్ యుద్ధ నివారణకు చేసిన ప్రయత్నాలు అద్భుతం
  • ఇద్దరితో మాట్లాడి శాంతి చర్చలకు నాంది పలికారు
  • ట్రంప్ పక్కనుండగా భారత వైఖరిపై మోడీ గర్జన

భారత్ ఎప్పుడూ శాంతి, సామరస్యాలనే చాటి చెబుతుందని, ఏకపక్షంగా ఎవరినీ సమర్ధించబోదని ప్రధాని మోడీ తెలిపారు. నిరంతరాయంగా సాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విరమణకు ట్రంప్ చూపిన చొరవ, చేసిన ప్రయత్నాలను మోడీ ప్రశంసించారు.

ఇక సహించేది లేదు…

భారత్ ఇకపై తటస్థ వైఖరిని అవలంబించబోదు. మేం ఎప్పుడూ శాంతివైపే నిలబడతాం అని అమెరికా గడ్డపై నిలబడి మోడీ రష్యాకు తేల్చి చెప్పారు. ఇది యుద్ధాలు చేసుకునే కాలం కానే కాదు.. యుద్ధ విరమణకు ట్రంప్ రెండు దేశాలతో జరిపిన చర్చలను మేం పూర్తిగా సమర్ధిస్తున్నాం.. ట్రంప్ చొరబాటును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాం అని మోడీ అన్నారు.నిన్న ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత మోడీ ఈప్రకటన చేశారు. ఉక్రెయిన్, రష్యా, యూరోపియన్ దేశాలు, కీవ్ అందరూ చర్చలు జరపాల్సిందే. పుతిన్ కూడా శాంతినే కోరుకుంటున్నారని తమ సంభాషణల్లో వ్యక్తమైందని, ఉక్రెయిన్ కూడా చర్చలకు రావడం మంచిదని ట్రంప్ అన్నారు. ప్రస్తుత కాలం యుద్ధకాలం కాదని శాంతి, సంయమనంతో వ్యవహరించి చర్చలు, దౌత్యం ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని మోడీ కూడా కోరారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభమయ్యేక గత ఏడాది అనేక సార్లు మోడీ ఇరు దేశాధినేతలతో ఫోన్ లో మాట్లాడారు.

మనకి మరింత పెరగకుండా…

భారత్ తో సహా అన్ని ప్రపంచ దేశాలపై అమెరికా టారిఫ్‌ లు విధిస్తున్నట్లు ట్రంప్ మోడీ టూర్ కి కొన్ని గంటల ముందే ప్రకటించారు.టారిఫ్‌ లు కూడా ఇచ్చి పుచ్చుకోడమే. మీరెంత వేస్తే అంతకంత మేమూ అంత వేస్తాం.. ఇక పై మొహమాటం లేదు అంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ టారిఫ్‌ లపై అమెరికా వెనక్కుతగ్గే పరిస్థితి కనిపించనందున, అమెరికా వాణిజ్యలోటును పూడ్చుకోడానికి ఇకపై ముందు ముందు విధించే మరిన్ని టారిఫ్‌ లు మన దేశానికి వర్తించకుండా మోడీ ఒప్పందం చేసుకునే వీలుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com