ఎగ్జామ్‌లో ఔట్ ఆఫ్ ది సిలబస్ క్వశ్చన్ వస్తే ఎలా ఫీలవుతామో.. అలా ఫీలవున్నారు ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఫ్యాన్స్. ఎందుకంటే డుప్లెసిస్‌ను రిలీవ్ చేయడంతో ఆర్సీబీ కొత్త కెప్టెన్ వేటలో పడింది. దీంతో ప్రస్తుతమున్న టీమ్‌లో విరాట్ కోహ్లీ తప్ప మరే ఆప్షన్ కనిపించడం లేదు.. సో.. ఆర్సీబీని ముందుండి నడిపించేది కోహ్లీనే అని అంతా ఊహించారు. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం రజత్ పటీదార్‌ను కెప్టెన్‌గా అనౌన్స్ చేసింది. దీంతో షాక్ అవ్వడం అందరి వంతైంది.
నిజంగా ఇది షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ డెసిషన్ అనే చెప్పాలి. ఆర్సీబీకి కొత్త కెప్టెన్ కాబోయేది ఇండియన్ ప్లేయర్ అని ముందే అనౌన్స్ చేసింది మేనేజ్మెంట్. అయితే కోహ్లీ లేదా భువనేశ్వర్‌ని సెలెక్ట్ చేస్తారు అనుకున్నారంతా. కానీ రజత్ పటీదార్ పేరును ఎవరూ ఊహించి కూడా ఉండరు.
పటీదార్ సెలక్షన్ కరెక్టేనా?
రజత్ పటీదార్‌ను కెప్టెన్‌గా తీసుకునేముందు బాగానే ఆలోచించినట్టు కనిపిస్తోంది ఆర్సీబీ మేనేజ్మెంట్. ఎందుకంటే కెప్టెన్సీ విషయంలో రజత్‌కు ఎక్స్పీరియన్స్ ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీ, విజయ్ హజారే ట్రోఫీల్లో మధ్యప్రదేశ్‌కు నాయకత్వం వహించాడు పటీదార్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ ఫైనల్స్ చేరుకోవడంలో అతని పాత్ర కీలకం. పది మ్యాచ్‌ల్లో 61 యావరేట్, 186 స్ట్రైక్ రేట్‌తో 428 పరుగులు చేశాడు పటీదార్. అందుకే పటీదార్వైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది.
పటీదార్ బెస్ట్ చాయిస్ అంటున్న కోహ్లీ..
పటీదార్ పేరు అనౌన్స్ కాగానే కోహ్లీ వెంటనే ఓ వీడియో రిలీజ్ చేశాడు. తనతో పాటు టీమ్ మొత్తం అతనికి సపోర్ట్ చేస్తుందని ప్రకటించాడు. అంతేకాదు ఫ్యాన్స్ కూడా పటీదార్‌కు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు కోహ్లీ. నిజానికి కోహ్లీకి, ఆర్సీబీకి ఉన్న బంధం అందరికి తెలిసిందే. అత్యంత ఎక్కువకాలం టీమ్‌ను నడిపించింది కోహ్లీనే. 2013 నుంచి 2021 వరకు మొత్తం 143 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు కోహ్లీ. అందుకే డుప్లెసిస్ వెళ్లగానే కోహ్లీనే మళ్లీ పగ్గాలు తీసుకుంటాడని అంతా ఊహించారు.
నిజానికి కెప్టెన్సీ విషయంలో కోహ్లీతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. అంతేకాదు టీమ్‌ను నడిపిచేందుకు కోహ్లీకి కెప్టెన్సీ అవసరం లేదని తెలిపింది.
అంచనాలకు అందని పటీదార్..
పటీదార్ ఒకప్పుడు ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా ఉండిపోయాడు. అలాంటి పటీదార్ ఇప్పుడు ఆర్సీబీ కెప్టెన్. అతను ఆడబోయేది కేవలం నాలుగో సీజన్ మాత్రమే. అతను ఆడింది కూడా 27 మ్యాచ్‌లే. కానీ చేసిన పరుగులు మాత్రం 799. 2022 సీజన్లో తన మెరుపు బ్యాటింగ్‌తో అందరిని సర్ప్రైజ్ చేశాడు పటీదార్. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై అతను చేసిన సెంచరీ మోస్ట్ మెమోరబుల్ అనే చెప్పాలి. ఆ తర్వాత గాయం కారణంగా సీజన్‌కు దూరమయ్యాడు. మళ్లీ లాస్ట్ సీజన్లో రీ ఎంట్రీ ఇచ్చి 395 పరుగులు చేవాడు.
20 లక్షల నుంచి 11 కోట్లకు రిటైన్ చేసుకోవడం ఆ తర్వాత కెప్టెన్‌ను చేయడం కలలో కూడా ఊహించిఉండడు పటీదార్. మరి లక్షలాది మంది ఆశలను ఈసారైనా పటీదార్ నిజం చేస్తాడా? లేదా? చూడాలి.