27.2 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

అందరి చూపు శ్వేత సౌధం పైనే…

  • బ్లెయిర్ ప్రెసిడెన్షియల్‌ గెస్ట్ హౌస్ లో బస
  • మోడీ మ్యాజిక్ చేస్తారని లక్షలాది మంది ఆశ
  • ఇమ్మిగ్రేషన్ పాలసీలో సడలింపులు వస్తాయా?
  • టారిఫ్‌ ల మోత తగ్గుతుందా?
  • పలు కీలక రంగాలపైనా ద్వైపాక్షిక భేటీలు
  • ట్రంప్‌కు అఖండ స్వాగతం పలికిన భారతీయులు
  • మస్క్ సహా అనేక మందిని కలిసే ఛాన్స్

అమెరికాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం బయల్దేరిన ప్రధాని మోడీ అక్కడకు చేరుకున్నారు. వివాదాస్పదమైన టారిఫ్‌ల మోత, కఠినతరమైన ఇమ్మిగ్రేషన్ విధానాలపైనా ట్రంప్ తో చర్చించేందుకు మోడీ సిద్ధపడుతున్నారు. మోడీ పర్యటనపై అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారతీయులు ఆశలు పెట్టుకున్నారు. ఇమ్మిగ్రేషన్ విధానంలో ఏవైనా సడలింపులు జరిపేలా ట్రంప్‌ ను మోడీ ఒప్పిస్తారేమోనన్న ఆశ చాలా మంది భారతీయుల్లో ఉంది. అంతేకాక అనేక కీలక రంగాలపైనా ఇరుదేశాధినేతలు చర్చలు జరుపుతారు. బిలియనీర్ ఎలన్ మస్క్ ని కూడా మోడీ ఈ ట్రిప్ లో కలిసే అవకాశం ఉంది.
ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక భారత, అమెరికా దేశాల మధ్య తొలి ద్వైపాక్షిక భేటీ కావడంతో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్న బ్లెయిర్ ప్రెసిడెన్షియల్‌ గెస్ట్ హౌస్ లో మోడీ బస చేస్తున్నారు.

మోడీకి ఘన స్వాగతం

అమెరికాకు కుదిపేస్తున్నతీవ్రమైన చలిగాలుల మధ్య, వర్షం పడుతున్నా అమెరికాలో ఉంటున్న భారత సంతతి అమెరికన్లు మోడీకి బ్లెయిర్ గెస్ట్ హౌస్ దగ్గర ఘన స్వాగతం పలికారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాల మధ్య ఆయనను ఆహ్వానించారు. మోడీ, మోడీ..అంటూ నినాదాలతో అమెరికా, భారత పతాకాలతో సందడి చేశారు.

ప్రపంచ దేశాలను టారిఫ్ ల మోతతో భయపెడుతున్న ట్రంప్ ను కలసి మనదేశంపై ఎలాంటి టారిఫ్‌ లు విధించవద్దని ఒప్పించడమే మోడీ పర్యటన ముఖ్యొద్దేశం. ఇప్పటికే ఇప్పటికే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌ లు ట్రంప్ విధించారు. ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ భారత్ పై పెను ప్రభావం చూపనుంది.ఈ రెండు ముడిసరుకులను అమెరికాకు పెద్ద ఎత్తున భారత్ ఎగుమతి చేస్తుంటుంది.తాజా టారిఫ్ల దెబ్బకు మన దేశంలో ఈరెండు రంగాల వ్యాపారాలు దెబ్బతినే ప్రమాదముంది.

కీలక రంగాలపై భేటీ

వీటితో పాటు పెట్టుబడులు,ఇంధన రంగం, డిఫెన్స్, టెక్నాలజీ ఇమ్మిగ్రేషన్ అంశాలే ఇరు దేశాధినేతల భేటీలో ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు, ఉక్రెయిన్ యుద్ధం, ఇండో-పసిఫిక్ తీరప్రాంతం పైనా రెండు దేశాల నేతలూ చర్చించే అవకాశముంది. ట్రంప్ అధికారం చేపట్టాక ఆయన్ను కలసిన దేశాధినేతల్లో ట్రంప్ నాల్గోవారు. ఇప్పటికే ఇజ్రాయెల్‌ ప్రధాని నేతన్యాహు, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా, జోర్డాన్ రాజ రెండవ అబ్దుల్లా ట్రంప్ ఆహ్వానాన్ని పొంది కలసిన వారిలో ఉన్నారు.

మస్క్ సహా ఇతర వాణిజ్య దిగ్గజాలతో భేటీ

ఇప్పటికే యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరక్టర్ తులసీ గబ్బార్డ్ ను కలసి భారత, అమెరికా స్నేహ సంబంధాలపై చర్చలు పూర్తి చేశారు ప్రధాని. బిలియనీర్ ఎలన్ మస్క్ ను కూడా వైట్ హౌస్ లో ప్రధాని కలవనున్నారు. ఆయనతో పాటు అనేక మంది వాణిజ్యవేత్తలతో సమావేశాలు కూడా మోడీ ఎజెండాలో ఉన్నాయి.

పదోసారి అమెరికాకు..

ప్రధాని హోదాలో మోడీ పదోసారి అమెరికా పర్యటన చేస్తున్నారు. అలాగే ట్రంప్‌ రెండోసారి పదవి చేపట్టాక కలసుకుంటున్న నాల్గవ ప్రపంచాధినేత కూడా మోడీయే.2024లో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఆహ్వానంతో సెరిమోనియల్‌ స్టేట్ విజిట్‌ చేశారు మోడీ. 2014లో బరాక్ ఒబామా అధ్యక్షుడుగా అధికారం చేపట్టినప్పుడు మోడీ ప్రధాని హోదాలో తొలిసారి అక్కడ అడుగు పెట్టారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com