33.1 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

కుంభమేళాలో73 లక్షల మంది మాఘపౌర్ణిమ స్నానాలు

  • సజావుగా సాగిన మాఘ పౌర్ణిమ స్నానాలు
  • నేటితో ముగిసిన కల్పవసీల దీక్ష
  • మేళా నుంచి వెనుదిరుగుతున్న 10 లక్షల మంది కల్పవసీలు
  • శివరాత్రి మరో పుణ్య తిధితో ముగియనున్న విశిష్ట ఘడియలు
  • మేళా ముగిసే నాటికి స్నానాలు చేసిన వారి సంఖ్య 50కోట్ల పైమాటే
  • ఊపిరి పీల్చుకున్నయోగీ, ఇతర మంత్రులు
  • ఫలించిన ట్రాఫిక్ మార్పులు,క్రౌడ్‌ మేనేజ్మెంట్‌ వ్యూహం
  • స్కూలు పిల్లలకు మూడు రోజులుగా ఆన్ లైన్ తరగతులే

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో మాఘ పౌర్ణమి స్నానాల జోరు తెల్లవారుజామునుంచే కొనసాగింది.కాసేపటి క్రితం పవిత్ర ఘడియలు ముగిసేనాటికి దాదాపు 73 లక్షల మంది మాఘ పౌర్ణిమ స్నానాలు ఆచరించి తర్పణాలు వదిలారు. గతనెల జనవరి 13న మేళా ఆరంభం నుంచి కల్పవసీ దీక్షలో ఉన్న పది లక్షల మంది ఈ పౌర్ణిమ సందర్భంగా దీక్ష ముగించుకుని పవిత్ర స్నానాలు,ప్రత్యేక పూజలు పూర్తి చేసుకుని వెనుదిరుగుతున్నారు.

లక్షలాది మంది పవిత్ర స్నానాలకు తరలి వచ్చినా యూపీ ప్రభుత్వం ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేపట్టడం ద్వారా క్రౌడ్‌ మేనేజ్ మెంట్‌ ను సమర్దవంతంగా చేయగలిగింది. సీఎం యోగీ ఆదిత్యనాథ్ నిరంతరాయంగా తన కార్యాలయంనుంచే కుంభమేళా రష్‌ గురించి ఆరా తీస్తూ, మానిటర్ చేస్తూ వచ్చారు.కల్పవసీలు నియమ నిష్టలతో అనుసరించిన ఇన్నిరోజుల ప్రత్యేక దీక్షలు ఇవాల్టితో ముగిసాయి. లక్షల సంఖ్యలో ఉన్న కల్పవసీలను పవిత్ర స్నానాలు చేశాకే వాహనాలతో లోపలికి రావడానికి అనుమతించారు. మాఘ పౌర్ణిమ రోజు కల్పవసీలకు అత్యంత ముఖ్యమైన పవిత్రమైన దినం.. ఈరోజు స్నానాలకు ఎంతో ప్రాధాన్యముంది. మరొక పుణ్యతిధి మిగిలుండగా కుంభమేళా పూర్తయ్యే నాటికి పవిత్ర స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 50 కోట్లు దాటిపోనుంది.ఈనెల 26న మహాశివరాత్రితో కుంభమేళా పుణ్య తిధులు పూర్తవుతాయి.

ఫలించిన ఏర్పాట్లు, ప్రత్యేక జాగ్రత్తలు

మాఘ పౌర్ణిమ స్నానాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగేందుకు ట్రాఫిక్ రూల్స్ లో మార్పులు కలిసొచ్చాయి. మేళా పరిసరాలను నో వెహికల్ జోన్ గా మార్చి పార్కింగ్‌ కు మరో చోట స్థలం కేటాయించారు. కల్పవసీల వాహనాలను కూడా ప్రాంగణంలోకి అనుమతించలేదు. అలాగే నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు కూడా కొన్ని మార్పులు చేసి సాయంత్రం వరకూ వాటిని అమల్లో ఉంచారు. దాంతో రష్‌ నియమబద్ధంగా సాగిపోయింది.కుంభమేళాకు మాఘపౌర్ణిమ సందర్భంగా అనుమతించిన ప్రత్యేక రైళ్లలో సౌకర్యాలు, రష్‌, ఏర్పాట్లపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
మాఘ పౌర్ణిమ ఏర్పాట్లను సమీక్షించిన యోగీ భక్తులు,సందర్శకులకు శుభాకాంక్షలు తెలిపారు. పౌర్ణిమ రష్ ను దృష్టిలో పెట్టుకుని ప్రయాగ్‌ రాజ్ లోని వేర్వేరు విద్యా బోర్డుల పరిధిలో ఉన్న అన్ని సెకండరీ స్కూళ్లకు ఏడో తేదీనుంచి నేటి వరకూ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించారు.
మాఘ పౌర్ణిమ పవిత్ర స్నానాలను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముగించగలిగామని, యూపీ జనాభా 25 కోట్లు కాగా ఇప్పటి వరకూ కుంభమేళాలో స్నానాలు చేసిన వారి సంఖ్య 50 కోట్లు దాటిపోయిందని యోగీ అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com