మాఘ పూర్ణిమ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభ మేళాలో కుటుంబ సమేతంగా పాల్గొని త్రివేణి సంగమంలో ఈరోజు పవిత్ర స్నానం ఆచరించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ మహాకుంభ్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఈ మహాకుంభ్ సొంతమని దత్తాత్రేయ పేర్కొన్నారు.
మరోవైపు ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. గంగా పూజ నిర్వహించి గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమలో బీజేపీ నేతలతో కలిసి మూడు మునకలు వేశారు. అయితే వారణాసి నుండి బయలుదేరిన ఈటల రాజేందర్, కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు ట్రాఫిక్ జామ్ వల్ల..10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి స్నానం చేసి, మళ్లీ పది కిలోమీటర్లు నడుచుకుంటూ రావల్సి వచ్చింది. మాజీ ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ నేతలు వేణుగోపాల్ రెడ్డి, మురళి యాదవ్, గిరివర్ధన్ రెడ్డి,పెరిక సురేష్ తదితరులు పాల్గొన్నారు.