27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

నిద్రలేమితో బాధపడుతున్నవారికి స్లీప్ థెరప్యూటిక్స్ వరం

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, యాంత్రిక జీవనం కారణంగా, చాలా మంది తమకు తెలియకుండానే నిద్ర లేమి సమస్యలతో బాధపడుతున్నారని, దీని పై అవగాహన లేమి వలన అందుబాటులో ఉన్న చికిత్సల గురించి కూడా తెలియక ఇబ్బందులు పడుతున్న వారికి చికిత్స అందించేందుకు స్లీప్ థెరప్యూటిక్స్ రెండవ శాఖను నేడు కూకట్‌పల్లిలో ప్రారంభించామని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు, ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఇటలీ ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ డాక్టర్ లోరెంజో కార్బెట్టా, బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ డాక్టర్ పియరో కాండోలి పల్మోనాలజీ నిపుణులు హాజరై స్లీప్ థెరప్యూటిక్స్ సెంటర్ ను ప్రారంభించారు.
నిద్రలేమి సమస్యల పై అవగాహన పెంపొందించడం తో పాటు రోజువారీ జీవితంలో ఇది చూపే గణనీయమైన ప్రభావాన్ని అందరికి వివరించి అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యం పై ప్రచారం నిర్వహించి ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశం తో ఈ సెంటర్ ను ప్రారంభించానని డాక్టర్ హర్షిణి తెలిపారు. స్లీప్ థెరప్యూటిక్స్ అనేది అత్యాధునిక, ప్రత్యేక వైద్య సదుపాయాలతో కలిగియున్నదని , ఇందులో గురక, నిద్రలేమి, పగటిపూట నిద్రపోవడం, నిద్రలో నడవడం వంటి వివిధ నిద్ర రుగ్మతలతో బాదపడుతున్న వారికీ సమగ్ర చికిత్సను అందిస్తుందని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com