35.2 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

బ్రహ్మా ఆనందం నుంచి మాస్ డ్యాన్స్ నంబర్ ‘రెచ్చి పోవాలే’ విడుదల

ప్రముఖ సంస్థ స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై యూనిక్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిన ‘బ్రహ్మా ఆనందం’ నుంచి మాస్ డ్యాన్స్ నంబర్ ‘రెచ్చి పోవాలే’ విడుదల

మళ్ళి రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హిట్ చిత్రాలతో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకుల్లో మంచి మార్కులు సంపాదించుకుంది. హ్యాట్రిక్ హిట్ల తరువాత ప్రస్తుతం ఓ సున్నితమైన అంశంతో ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రంతో అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు వస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌కి ఇది నాలుగో ప్రాజెక్ట్. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక తాజాగా ఈ చిత్రం నుంచి  ఓ మాస్ నంబర్‌ను రిలీజ్ చేశారు. గ్రామాల్లో జాతర అంటే ఎలా ఉంటుందో.. ఆ సందడి ఎలా ఉంటుందో ఈ ‘రెచ్చిపోవాలే’ పాటలో చూపించబోతోన్నారు. శాండిల్య పిసాపాటి బాణీ, శ్రీ సాయి కిరణ్ సాహిత్యం, సింగర్ సాకేత్-శాండిల్య గాత్రం ఈ పాటకు అదనపు ఆకర్షణ. ఇక ఈ పాటలో రాజా గౌతమ్ ఎనర్జిటిక్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

బ్రహ్మా ఆనందం చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు, క వంటి చిత్రాల తరువాత నంది వంశీ నందిపాటి ఈ మూవీని ఫ్యాన్సీ రేటుకు హక్కుల్ని చేజిక్కించుకున్నారు.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. శాండిల్య పిసాపాటి సంగీతం సమకూర్చగా, మితేష్ పర్వతనేని కెమెరా మెన్‌గా, ప్రణీత్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు.

నటీనటులు : రాజా గౌతమ్, “పద్మశ్రీ” బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు, ప్రభాకర్, డివిజ ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్

నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా

దర్శకుడు: Rvs నిఖిల్

DOP: మితేష్ పర్వతనేని

సంగీత దర్శకుడు: శాండిల్య పిసపాటి

ఎడిటర్: ప్రణీత్ కుమార్

ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.వంశీకృష్ణా రెడ్డి, పి.దయాకర్ రావు

PRO: వంశీ కాకా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com