ధ్వని కంటే ఆరు రెట్లు వేగంతో ప్రయాణించే క్షిపణలు తయారీలో భారతదేశం మరో అడుగు ముందుకు వేసింది. ఒరిస్సా రాష్ట్రంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఆదివారం హైపర్సోనిక్ టెక్నాటజీతో తయారు చేసిన క్షపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయినట్లు ప్రకటించారు. అమెరికా, రష్యా, చైనా దేశాల తరువాత హైపర్సోనిక్ వాహనాల తయారీ క్లబ్ లో భారత్ కూడా చేరింది. ఆదివారం విజయవంతం అయిన పరీక్ష ద్వారా వచ్చే ఐదేళ్ళలో భారత్ తన తొలి హైపర్సోనిక్ క్షిపణి తయారు చేయగలదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఘనత సాధించినందుకు డీఆర్డీఓను రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్ అభినందించారు.