తమిళనాడులో స్ధిరపడిన తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని ఎగ్మోర్ పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. నవంబర్ 3వ తేదీన ఒక సామాజికవర్గ సమ్మేళన కార్యక్రమంలో కస్తూరి తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రం వ్యక్తం చేసిన తమిళనాడులో స్ధిరపడ్డ తెలుగువారు చెన్నైలోని ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో కస్తూరిపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచీ పరారిలో ఉన్న కస్తూరిని ఎగ్మోర్ పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఒక సినీ నిర్మాత నివాసంలో పట్టుకుని అరెస్ట్ చేసి చెన్నై తరలించారు. ఆమెకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కస్తూరిని పోలీసులు పుళల్ సెంట్రల్ జైలుకి తరలించారు.