తెలంగాణ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. షకీల్ కొడుకు సాహెల్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే అని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈనెల 16వ తేదీన పంజాగుట్ట పోలీసుల ముందు షకీల్ కుమారుడు సాహెల్ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ప్రజాభవన్ గేట్స్‌ను రాష్ డ్రైవింగ్‌తో ఢీకొట్టిన ఘటనలో సాహెల్‌పై కేసు నమోదయ్యింది. అయితే, పోలీసుల కేసు నుంచి తప్పించుకునేందుకు సాహెల్ దుబాయ్ పారిపోయాడు. ఇప్పటికీ రాలేదు. అయితే, పోలీసుల విచారణ కోసం సాహెల్ దుబాయ్ నుంచి రావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది.