వైఎస్సార్సీపీ శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ పై ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని టెక్కలి నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు కణతి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై టెక్కలి పోలీసులు దువ్వాడపై కేసు నమోదు చేశారు. మండలి సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో దువ్వాడ అమరావతిలో ఉన్నారు. టెక్కలి పోలీసులు అమరావతి వచ్చి దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు ఇస్తారో లేక సమావేశాలు ముగిసిన తరువాత టెక్కలిలో నోటీసులు ఇస్తారో చూడాలి.
- Advertisement with us -