గీతా గోవిందంతో మొదలైన స్నేహం…పెళ్ళి పీఠల వరకు వచ్చినట్టుగా స్పష్టత వస్తోంది. ఇదే విషయాన్ని రౌడీ బాయ్ ‘విజయ్ దేవరకొండ’ ఎట్టకేలకు రష్మికతో తన బంధాన్ని రివీల్ చేశారు.
ఇటీవల రిలీజైన ‘సాహిబా’ సాంగ్ ప్రమోషన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ కంపోజర్ జస్లీన్ రాయల్ తో పాటు హీరోయిన్ రాధికా మదన్ పాల్గొని విజయ్ లవ్ లైఫ్ సీక్రెట్స్ ని బయటపెట్టారు.
యంగ్ బాయ్స్ కి విజయ్ మంచి సలహా ఇచ్చాడు. “ప్రేమ విషయంలో ముందుగా కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలి. లవ్ విషయంలో 30 దాటిన పురుషులు 20 ఏండ్ల మధ్య ఉన్నవారికంటే బెటర్‌గా ఆలోచిస్తారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్.
20 నుండి 30 ఏళ్ల మధ్య ఉన్నప్పుడు మనం అస్థిరంగా ఉంటామన్న విజయ్ ఏది డిసైడ్ చేసుకోలేమని సమయం వచ్చినప్పుడు అవే జరుగుతాయని ప్రేమ విషయంలో ముక్తాయింపు ఇచ్చాడు.