తెలంగాణ శాసనసభ శాతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 9వ తేదీన సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావొస్తున్నందున ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. రాబోయే కాలంలో చేపట్టనున్న సంక్షేమ కార్యక్రమాల వివరాల్ని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉంది.
మరోవైపు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సన్నద్దం అవుతున్నాయి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు, ఎన్నకల హామీల అమలులో అలసత్వంపై ప్రశ్నించే అవకాశం ఉంది.