33.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన అయ్యన్న, రఘురామ

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సభ్యులకు దిశానిర్దేశం చేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు.. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణం రాజు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ పార్లమెంటు హౌజ్‌లో ఓం బిర్లాను కలిసిన స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమానికి తప్పకుండా వస్తానని, ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. అలాగే, ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేలా లోక్‌సభ తరపున కూడా అన్నిరకాలుగా సహకారం అందిస్తామన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com