ఈ నెల 21, 22 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజులపాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించేందుకు మాన్యువల్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
పోలీసు శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు, సరైన ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు అన్ని వేదికల వద్ద తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. వైద్యారోగ్యశాఖ సహాయక సిబ్బందితోపాటు అర్హులైన వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రపతి బస చేసే ప్రదేశం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖను ఆదేశించారు. అన్ని వేదికల వద్ద అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ ను ఆదేశించారు.