టాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‘వ్యూహం’ ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టాడని టీడీపీ నాయకుడు రామలింగం ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ యాక్ట్ కింద రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మద్దిపాడు పోలీసులు.. నోటీసులు జారీ చేశారు. ఈనెల 19వ తేదీన ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీస్‌కి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Advertisement with us -