24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

యూ ట్యూబ్ లో దద్దరిల్లుతున్న పుష్ప2 ట్రైలర్

  • 15 గంటల్లో 42 మిలియన్ల వ్యూస్
  • సరికొత్త రికార్డ్ నెలకొల్పిన అల్లు అర్జున్

యూట్యూబ్ వ్యూవర్షిప్ లో అల్లు అర్జున్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకూ ఉన్న రికార్డులను బద్దలు కొట్టి అల్లు అర్జున్ నటించిన పుష్ప2 ట్రైలర్ 15 గంటల్లో 40 మిలియ్ల వ్యూస్ ను సాధించింది. ఇంతకు ముందు హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ లు వరుసగా ఈ రికార్డులను నెలకొల్పారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ట్రైలర్ 37.68 మిలియన్ల వ్యూస్ సాధించగా, ప్రభాస్ నటించి సాలార్ మూవీ ట్రైలర్ 32.58 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. అయితే వారిద్దరు నటించిన ఈ రెండు సినిమా ట్రైలర్ల వ్యూస్ 24 గంటల్లో సాధించగా అల్లు అర్జున్ నటించిన పుష్ఫ 2 ట్రైలర్ కేవం 15 గంటల్లో 40 మిలియన్ల వ్యూస్ దాటిపోయింది. 24 గంటలు గడిచేలోపు ఇంకెన్ని వ్యూస్ సాధిస్తుందో చూడాలి.

ఆదివారం సాయంత్ర 6.03 గంటలకు విడుదలైన ట్రైలర్ లో ఎక్కడా సినిమా కధను రివీల్ చెయ్యకుండా జాగ్రత్తపడ్డారు. పుష్ఫ మొదటి భాగంలో ఉన్న నటీనటులందరూ రెండో భాగంలో కూడా ఉన్నట్లు ట్రైలర్ లో స్పష్టమవుతోంది. హీరో అల్లు అర్జున్ ఎలివేషన్ సీన్లు పుష్కలంగా ఉన్నట్రైలర్ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పుష్ఫ అంటే పువ్వు కాదు ఫైర్ అని మొదటి భాగంలో చెప్పించిన దర్శకుడు పుష్ప 2లో వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ ను ఎక్కువగా ఎలివేట్ చేశారు. మొత్తం మీద తెలుగు, హిందీ బాషల్లో విడుదలైన పుష్ప 2 ట్రైలర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com