24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

మేయర్ భర్తపై దాడికి భూ వ్యవహారాలే కారణం..?

నిజామాబాద్ నగరంలో భూదందాలు, సెటిల్ మెంట్లు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో
నిజమాబాద్ నగర మేయర్‌ నీతూకిరణ్‌ భర్త దండు శేఖర్‌పై ఓ వ్యక్తి రాడ్ తో దాడి చేశారు. సోమవారం సాయంత్రం నగరంలోని నాగారం ప్రాంతంలో ఉన్న ఆయన వద్దకు ఆటోడ్రైవర్ రసూల్ ప్లాట్ విషయంలో మాట్లాడుదామని వచ్చి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి  దాడికి దారితీసిందని సమాచారం.

మేయర్ బర్త శేఖర్ ను రసూల్ కొట్టడంతో శేఖర్ కిందపడిపోగానే రసూల్ ఆటోలోనుండీ సూత్తెను తెచ్చి తలపై గట్టిగా కొట్టి దాడికి దిగాడు. దీంతో మేయర్ భర్త దండు శేఖర్ అక్కడికక్కడే కుప్పకులాడు. తలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శేఖర్‌ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పోలిస్ స్టేషన్ లో ఏలాంటి పిర్యాదు చేయలేదని సమాచారం.

 

వివరాల్లోకి వెళితే మేయర్ భర్త నాగారం ప్రాంతంలో భారీగా సెటిల్ మెంట్లు చేస్తున్నట్టు వినికిడి. భూ వ్యవహారాల్లో ఏ మాత్రం లొసుగులు దొరికినా అందులో మేయర్ భర్త జోక్యం చేసుకోవటం పరిపాటిగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com