29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

మిస్టర్ ఇడియ‌ట్‌ లిరికల్ సాంగ్ రిలీజ్

మాస్ మహరాజ హీరో రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ “మిస్టర్ ఇడియ‌ట్‌” చిత్రంలో హీరోగా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌ కాగా… జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ “మిస్టర్ ఇడియ‌ట్‌” సినిమా నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు.

వర్సటైల్ యాక్టర్ శివాజీ చేతుల మీదుగా “మిస్టర్ ఇడియ‌ట్‌” నుంచి ‘వస్సాహి వస్సాహి..’ లిరికల్ సాంగ్  ఈ రోజు(బుధవారం) రిలీజ్ చేశారు. ‘వస్సాహి వస్సాహి..’ సాంగ్ కంపోజిషన్ అదిరిందని, కలర్ ఫుల్ పిక్చరైజేషన్ తో ఆకట్టుకుందని శివాజీ అభినందించారు. ఇంతవరకు సంస్కృత భాషలో ఏ పాట రాలేదు, ఇది ఫస్ట్ సాంగ్ అని శివాజీ ప్రశంసించారు.

‘వస్సాహి వస్సాహి..’ పాటకు అనూప్ రూబెన్స్ సూపర్ బీట్ తో కంపోజ్ చేయగా లెజెండరీ లిరిక్ రైటర్ శివశక్తి దత్తా సాహిత్యాన్ని అందించారు. సింగర్ శ్రీరామచంద్ర గాత్రం ఆకట్టుకుంటుంది. ‘సౌందర్య సార, మకరంద దార, శృంగార పారవరా, సౌవర్ణ ప్రతిమ, లావణ్య గరిమ,చతురస్య చాతుర్య మహిమ కింతు పరంతు విరంచ్య విరచితం కిమిదం, ఇదంకిం తమాషా…వస్సాహి వస్సాహి’ అంటూ సంస్కృత సాహిత్యంతో ఆకట్టుకునేలా సాగుతుందీ పాట

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com