28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

మహారాష్ట్రపై భిన్న వాదనలు, ఝార్ఖండ్లో ఎన్.డి.ఏ ..ఎగ్జిట్ పోల్స్

మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో శాసనసభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (మహారాష్ట్రలో మహాయుతి), కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ బ్లాక్ (మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి) మధ్య హోరాహోరీ పోరు సాగింది. మహారాష్ట్రలో ‘లడ్కీ బహన్ యోజన సహా పలు సంక్షేమ పథకాలపై ప్రచారం సాగించింది. మహారాష్ట్రలో మహాయుతి అవకతవకల పాలన కారణంగా అభివృద్ధి నిలిచిపోయిందని, ఉపాధి అవకాశాలు కోల్పోయిందని ప్రచారం సాగించింది.

SAS survey

మరోవైపు ‘ఇండియా’ కూటమి జార్ఖాండ్‌లో ‘మైయ సమ్మాన్ యోజన’ వంటి సంక్షేమ పథకాలను ప్రచారాస్త్రంగా చేసుకుంది. జార్ఖాండ్‌లో జనాభా సమతౌల్యం ఆంశాన్ని ఎన్డీయే కూటమి ప్రధాన ఎన్నికల అస్త్రంగా తీసుకుంది.

chankya strategy

మహారాష్ట్ర

చాణక్య స్ట్రాటజీ ప్రకారం మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పీపుల్స్ పల్స్ ప్రజాభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడి కూటమికి ఆధిక్యం కనిపిస్తోంది. IIT ఖరగ్ పూర్ పట్టభద్రుడు, సెపాలిజిస్టు విఆర్ మూర్తి… మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడికి పట్టం కట్టారు.

దైనిక్ భాస్కర్ మరాఠ పీఠం మహా వికాస్ అఘాడికే దక్కనుందని ప్రకటించింది. CNN, టైమ్స్ నౌ మాత్రం మహాయుతి వైపు మొగ్గు కనబరచాయి.

దైనిక్ భాస్కర్

మహా వికాస్ అఘాడి – 135-150

మహాయుతి – 125-140

ఇతరులు-20-25

CNN

మహాయుతి -154

మహా వికాస్ అఘాడి  -128

ఇతరులు-6

టైమ్స్ నౌ

మహాయుతి – 105-126

మహా వికాస్ అఘాడి -68-91

ఇతరులు-08-12

 

ఝార్ఖండ్

ఝార్ఖండ్ లో ఎన్.డి.ఏ కూటమి అధికారంలోకి రానుందని చాణక్య స్ట్రాటజీ, పీపుల్స్ పల్స్ సంస్థలు ప్రకటించాయి. మహారాష్ట్ర, జార్ఖండ్‌ల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికే విజయావకాశాలు ఉన్నాయని మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్‌ పేర్కొంది. CNN, టైమ్స్ నౌ సంస్థలు కూడా ఎన్.డి.ఏ కూటమికి జై కొట్టాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com