మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ నిర్వహించతలపెట్టిన ధర్నా కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గిరిజన రైతు ధర్నా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ నిర్ణయించింది. సోమవారం ధర్నా చేపట్టాలని ప్లాన్ చేసింది. అయితే, పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించారు. దీంతో, బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్ నేతల అభ్యర్థన మేరకు హైకోర్టు గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా చేపట్టేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరుచేసింది. అయితే, సభలో వెయ్యి మంది మాత్రమే పాల్గొనాలని పరిమితి విధించింది.