మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు వాయానాడ్, నాందేడ్ లోకసభ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. వీటితో పాటుగా దేశ వ్యాప్తంగా 46 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడతాయి. ఉదయం 8 గంటలకు అన్ని కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అధికారులు కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి తరువాత ఈవీఎం లను లెక్కిస్తారు. మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలో మహాయతి కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలో మహా వికాస్ అఘాడి కూటమిలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా మహాయతి కూటమి నుంచి బీజేపీ 149, శివసేన (షిండే) 81 ఎన్సీపీ (అజిత్) 59 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసాయి. మహా వికాస్ అఘాడి నుంచి కాంగ్రెస్ 101, శివసేన (ఉద్దావ్) 95 ఎన్సీపీ (శరద్) 89 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసారు. ఈ నెల 26తో ముగియనున్న మహా అసెంబ్లీ గడువు మగుస్తుంది. మహారాష్ట్ర లో అధికారం చేపట్టాలంటే 145 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాలి. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో మొత్తం 81 స్థానాలు ఉండగా అధికారం చేపట్టాలంటే 41 స్థానాలను కైవసం చేసుకోవాలి. ఈ నెల 20v తేదీన ఒకే విడతలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగగా జార్ఖండ్ కు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో 43 స్థానాలకు రెండో విడతలో 38 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు 67.74 శాతం పోలింగ్ నమోదయ్యింది. ప్రియాంకగాంధీ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యడం తో వాయానాడ్ ఉప ఎన్నికపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఇక్కడ ప్రియాంకపై బీజేపీ నుంచి నవ్య హరిదాస్ పోటీలో ఉన్నారు.
- Advertisement with us -