25.7 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ సాంగ్

యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ మ్యూజికల్ ప్రమోషన్లు ఈ రోజు ప్రారంభమయ్యాయి, మేకర్స్ ఫస్ట్ సింగిల్-బుజ్జి తల్లి లిరికల్ వీడియోను విడుదల చేశారు. హార్ట్ ఫుల్ లవ్ స్టోరీస్ ని తీయడంలో మాస్టర్ అయిన చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలోని ఈ సాంగ్ లీడ్ పెయిర్ ఎమోషనల్ జర్నీని అందంగా ప్రజెంట్ చేసింది.

దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ మ్యాజికల్ గా వుంది. హీరో తన బాధలో ఉన్న ప్రియురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కథలో కీలకమైన సమయంలో ఈ సాంగ్ వస్తుంది. లిరికల్ వీడియో ద్వారా లీడ్ పెయిర్ బాండింగ్ అద్భుతంగా చూపించారు. శ్రీమణి రాసిన లిరిక్స్, తన ప్రేమికురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్న హీరో భావోద్వేగాలకు కవితాత్మకంగా ప్రజెంట్ చేశాయి. జావేద్ అలీ సోల్ ఫుల్ వోకల్స్ ట్రాక్‌ కు మరింత డెప్త్ ని యాడ్ చేశాయి.

లిరికల్ వీడియో లీడ్ రోల్స్ జర్నీని, వారి ప్రేమకథను విజువల్ గా అద్భుతంగా ప్రజెంట్ చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి స్క్రీన్ పై ప్లజెంట్ కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల స్ఫూర్తితో రూపొందింది. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com