28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

నవంబరు 28న రోటి కపడా రొమాన్స్‌

ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. తొలుత ఈ చిత్రాన్ని నవంబరు 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. థియేటర్స్‌ దొరకని కారణంగా చిత్రాన్ని ఈ నెల 28న మాసివ్‌ గ్రాండ్‌ రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాతలు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా, నేటి యూత్‌ను ఆకట్టుకునే అంశాలుతో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేస్తున్నాం. ఈ నెల 22 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో పెయిడ్‌ ప్రీమియర్స్‌ ప్లాన్‌ చేస్తున్నాం.

ఇటీవల కొంత మంది ప్రేక్షకులకు, యూత్‌కు సినిమాను ప్రదర్శించాం. అందరి నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. బుధవారం మీడియాకు వేసిన షోకు కూడా మంచి స్పందన వస్తోంది.

గ్రాండ్‌ ప్రీమియర్స్‌ లో హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను ప్రదర్శించనున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com