27.8 C
Hyderabad
Sunday, July 12, 2026

Live Video

spot_img

నరేందర్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో హైకోర్టు అక్షింతలు

లగచర్ల ఫార్మా వ్యవహారంలో కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విధానంపై తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రిమాండ్‌ ఆర్డర్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు వాదనలు విని.. తీర్పు రిజర్వ్‌ చేసింది. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని హైకోర్టు ఆదేశించింది. కేబీఆర్‌ పార్క్‌ వద్ద వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారు? మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాది మాదిరిగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది.

నరేందర్‌రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్‌రెడ్డి మాట్లాడారని పీపీ ధర్మాసనానికి తెలిపారు.

వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో 1350 ఎకరాల్లో మొదట ఫార్మా సిటీ పెట్టాలని భావించిన ప్రభుత్వం ఆ తర్వాత.. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయణ సేకరణ చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్‌పై దాడికి పాల్పడ్డారంటూ పలువురు రైతులతో పాటు బీఆర్‌ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో పట్నం నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉందంటూ ఆయనను పోలీసులు హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. తన రిమాండ్‌ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

మరోవైపు కొడంగల్ న్యాయస్థానం వద్ద న్యాయవాదులతో మాట్లాడిన నరేందర్ రెడ్డి… సిఎం రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుంచే ప్రారంభం అయిందని అన్నారు. రైతులకు మద్దతుగా నిలిచినందుకు కేసులు నమోదు చేయటం దారుణమని ఆగ్రహం వ్యకం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com