24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

తుపాకీ పేలి అమెరికాలో హైదరాబాదీ మృతి

పుట్టిన రోజు వేడుకల్లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి హైదరాబాదీ యువకుడు మృతి చెందిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. హైదరబాద్ కు చెందిన ఆర్యన్ రెడ్డి నవంబర్ 13న అట్లాంటాలో తన స్నేహితులతో కలసి పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు. ఈ సమయంలో కొత్తగా కొన్న హంటింగ్ గన్ శుభ్రం చేస్తుండగా అది ప్రమాదవశాత్తు పేలిపోవడంతో ఆర్యన్ రెడ్డి మృతి చెందారు. తుపాకీ శబ్దం విన్న అతని స్నేహితులు ఆర్యన్ రెడ్డి గదికి చేరుకున చూడగా రక్తపు మడుగులో పడిఉన్నాడు. రక్తపుమడుగులో పడి ఉన్న స్నేహితుడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆర్యన్ రెడ్డి అట్లాంటాలోని కాన్సాస్ స్టేట్ యూనివర్శిటీలో ఎమ్మెస్ రెండో సంవత్సరం చదువుతున్నారు. మృతిడి తండ్రి పాల్వాయి సుదర్శన్ రెడ్డి స్వగ్రామం భువనగిరి జిల్లా పెద్దరావుపల్లి గ్రామం. అయితే గత కొంత కాలంగా ఉప్పల్ ధర్మపురి కాలనీలో నివాసం ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు అమెరికాలో మృతి చెందడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆర్యన్ రెడ్డి మృతదేహం శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com