దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం సీనియర్ ఢిల్లీ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఢిల్లీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ సురక్షితంగా ఉంటామన్న భరోసా కల్పించేలా అధికారులు విధి నిర్వహణలు చేపట్టాలని సూచించారు. ఇది ప్రతి పోలీసు అధికారి బాధ్యత అని చెప్పారు. ఈ సమావేశంలో హోం సెక్రటరీ, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లను రక్షించడం ఢిల్లీ పోలీసులకు అత్యంత ప్రాధాన్యతగా ఉండాలని హోం మంత్రి సూచించారు. రాజధానిలో ప్రజల భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబించే సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారిస్తూ, బలగాలు నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. దేరాజధానిలో శాంతిభద్రతల్లో బాధ్యతారాహిత్యాన్ని సహించబోమని హెచ్చరించారు. నేరస్థులలో భయాన్ని నింపుతూనే పౌరులలో భద్రతా భావాన్ని పెంచేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేయాలని సూచించారు.
ఢిల్లీలో శాంతిభద్రతలపై అమిత్‌షా సమీక్ష
- Advertisement with us -