29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

డిసెంబర్‌ 15, 16 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-2 పరీక్షలకు సంబంధించి తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే పరీక్ష తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ.. వచ్చే నెల 9న హాల్‌టికెట్లను విడుదల చేయనుంది. డిసెంబర్‌ 9 నుంచి పరీక్ష జరిగే రోజు వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 15, 16 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయి. మొత్తం 783 గ్రూప్‌- 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

డీఎస్సీ, గ్రూప్‌-2 మధ్య వారం రోజుల వ్యవధి ఉండటంతో పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసి డీఎస్సీని మాత్రం యథాతథంగా నిర్వహించారు. ఎంపికైనవారికి నియామకపత్రాలు కూడా అందించారు. ఇక గ్రూప్‌-2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్షలు.. 
డిసెంబర్‌ 15- ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1
డిసెంబర్‌ 15- మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2
డిసెంబర్‌ 16- ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3
డిసెంబర్‌ 16- మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-4

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com