24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

డివైన్ థ్రిల్లర్ తో వస్తొన్న మానస వారణాసి

దేవకి నందన వాసుదేవ లాంటి కమర్షియల్ డివైన్ థ్రిల్లర్ తో హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ మానస వారణాసి…అందులో చేసిన సత్యభామ క్యారెక్టర్ తోొ గుర్తింపుపొందింది.

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’లో హీరోయిన్ గా మానస వారణాసి అలరించనుంది. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు.

నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ ఈ చిత్రం నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

హైదరాబాదులోనే పుట్టిన ఈ అమ్మడు టెన్త్ క్లాస్ వరకు మలేషియాలో చదువుకుంది. హైదరాబాదులో ఇంజనీరింగ్, కార్పొరేట్లో జాబ్ ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో… మిస్ ఇండియా టైటిల్ గెలిచింది. మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా ని రిప్రజెంట్ చేసిన మానస వారణాసి తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com