37.2 C
Hyderabad
Thursday, May 14, 2026

Live Video

spot_img

డియర్‌ కృష్ణ మూవీ టీమ్‌ బంపర్‌ ఆఫర్‌ – లక్ష గెలుచుకునే ఛాన్స్‌

తెలుగులో ఇటీవలి కాలంలో అత్యంత అనుభూతిని కలిగించేలా ప్రేక్షకులను పలకరించబోతోంది డియర్‌ కృష్ణ సినిమా. అయితే, ఆసినిమా వస్తూ వస్తూనే అదృష్టాన్ని కూడా తీసుకొస్తోంది. అనుభూతి, అదృష్టం కలగలిసేలా మూవీ టీమ్‌ ఓ ధీమ్‌ను ప్లాన్‌ చేసింది. ప్రేక్షకులకు లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’ పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. ‘డియర్ కృష్ణ’ సినిమా ద్వారా యువ సంచలనం అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య కూడా మరో హీరోయిన్ గా ఈ సినిమాలో అలరించబోతున్నారు.

శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ ని ప్రేరణగా తీసుకొని, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘డియర్ కృష్ణ’ కథాకథనాలు కొత్తగా, ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. కథాకథనాలలో మాత్రమే కాకుండా, ప్రచార కార్యక్రమాల్లోనూ కొత్తదనాన్ని చూపిస్తోంది టీమ్. ఈ క్రమంలో “లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం” అంటూ వినూత్న కాంటెస్ట్ ను ప్రకటించింది.

“మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా. అయితే మీరు లక్ష రూపాయలు గెలుచుకున్నట్లే. డియర్ కృష్ణ మూవీ టీం ఒక కాంటెస్ట్ పెడుతుంది. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ ని బేస్ చేసుకొని ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాంటి మిరాకిల్ మీ ఫ్యామిలీలో ఏదైనా జరిగితే ఆ ఎక్స్ పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోండి. మాకు వచ్చిన ఎంట్రీస్ లో మూడు ఫ్యామిలీస్ ని సెలెక్ట్ చేసి, వారిలో బెస్ట్ ఫ్యామిలీకి రూ.1 లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం. ఆ భగవంతుడితో మీకు ఉన్న ఎక్స్ పీరియన్స్ ని వాట్సాప్ (9847622342) లో షేర్ చేయండి లేదా మెయిల్ (pnbalaram@gmail.com) చేయండి.” అంటూ ‘డియర్ కృష్ణ’ నిర్మాత సంచలన ప్రకటన చేశారు.

హరి ప్రసాద్ సంగీతం అందిస్తున్న డియర్ కృష్ణ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా దినేష్ బాబు, ఎడిటర్ గా రాజీవ్ రామచంద్రన్ వ్యవహరిస్తున్నారు. లెజెండరీ సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట ఈ సినిమా లోనిదే కావడం విశేషం. ‘చిరుప్రాయం’ అంటూ సాగే ఈ పాట ఇప్పటికే విడుదలై విశేషంగా ఆకట్టుకుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com