28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్న.. జిన్‌పింగ్!

ఖచ్చితంగా జరగదు. కానీ జరిగే అవకాశం ఉందంటూ ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు మాత్రం వండి వారుస్తున్నారు. అయితే తాజాగా ట్రంప్ తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవ్వాలంటూ .. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆహ్వానం పంపారని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా జనవరి 20న ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. అయితే ట్రంప్‌ తనకు చైనా అధ్యక్షుడితో మంచి సంబంధాలు ఉన్నాయి.. ఈ మధ్యే తాము మాట్లాడుకున్నాము.. అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ట్రంప్ ఆహ్వానం పంపే ఉంటారన్న నమ్మకం ఏర్పడుతుంది. అయితే ఈ ఇన్విటేషన్‌పై మాత్రం ఇరు దేశాలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే ఈ విషయం బయటికి రావడానికి ముందు ఓ కీలక ఘటన మాత్రం జరిగింది. డొనాల్డ్ ట్రంప్‌ ఇప్పటికే అనేక దేశాలకు పన్నులు పెంచుతానని వార్నింగ్ ఇచ్చారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడీ లిస్ట్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూడా చేరారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలన్నది ఇప్పుడు అర్థం కావడం లేదు. చైనా-అమెరికా మధ్య టారిఫ్‌, టెక్‌ యుద్ధాల్లో విజేతలు ఉండరని తెలిపారు. టారిఫ్‌ వార్‌, ట్రేడ్‌ వార్‌, టెక్నాలజీ వార్‌ అనేవి చట్టాలకు విరుద్ధంగా ఉంటాయి.. వీటిలో విజేతలు ఉండరన్నారు జిన్‌పింగ్.

ఇవి ట్రంప్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ట్రంప్‌కు సూచనలు చేస్తూ చేప్తున్నారా? లేక మీరు చేసే పనులతో పెద్దగా ప్రభావం ఉండదని చెప్పకనే చెబుతున్నారా? అనేది మాత్రం తేలలేదు. అయితే వరల్డ్‌ బ్యాంక్‌, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌ వంటి 10 అంతర్జాతీయ సంస్థల అధినేతలతో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు జిన్‌పింగ్‌. తమ ఫోకస్‌ మొత్తం తమ దేశ సొంత వ్యవహారాలపైనే ఉంటుందని మాత్రం తేల్చి చెప్పారు.

అయితే ట్రంప్‌ వ్యాఖ్యలను చూస్తుంటే అధికారం చేపట్టే నాటికి అందరూ దారికి వస్తారనుకున్నారేమో కానీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ట్రంప్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ వాటిని ఎదుర్కోనేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్‌ తాను అధికారంలోకి వచ్చాక చైనా ఎగుమతులపై 60 శాతం పన్నులు విధిస్తానన్నాడు. దీంతో చైనా అలర్టైంది. అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ ఎన్‌విడియాపై ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించింది. అంతేకాదు చైనా చిప్స్‌ వాడకాన్ని తగ్గించాలని కూడా చైనాలోని పెద్ద సంస్థలను కోరింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జిన్‌పింగ్ చైనాకు వస్తారనుకుంటే తప్పులో కాలేసినట్టే అవుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com