28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

చిన్నారులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి

హైదరాబాద్‌ మణికొండ పుప్పాలగూడలోనిప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దశరథ్‌ నాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్‌ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు బాగా చదువుకొని.. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, చదువుకున్న పాఠశాలకు కూడా మంచిపేరు తీసుకురావాలని రామకృష్ణారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఏర్పుల కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com