తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన గ్రూప్-4 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 289 మంది హాజరుకాలేదు. నవంబర్ 21, 22 తేదీల్లో ధ్రువ పత్రాల పరిశీలన జరిగింది. హైదరాబాద్ జోన్ పరిధిలో 2,217 మంది అభ్యర్థులకు గాను 1,928 మంది మాత్రమే హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో ధ్రువ పత్రాల పరిశీలన కోసం ప్రభుత్వం మరికొన్ని రోజులు గడువు పొడిగించింది.