సిఎం రేవంత్ రెడ్డి అల్లుడు గొలుగూరి సత్యనారాయణ మాక్స్ బెయాన్ ఫార్మా కంపెనీపై న్యూఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఫిర్యాదు చేశారు.
రేవంత్ ప్రభుత్వం కొడంగల్ లో మాక్స్ బెయాన్ ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ చేపట్టిన నేపథ్యంలో స్థానిక రైతులు ముఖ్యమంత్రి అల్లుడికి చెందిన ఆ కంపెనీకి భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. Maxbien ఫార్మా సంస్థలో రేవంత్ అల్లుడు డైరెక్టర్ గా 16 లక్షల షేర్లు ఉండడం అదే సంస్థలో మరో డైరెక్టర్ గా ఉన్న అన్నం శరత్ మరియు తను డైరెక్టర్గా ఉన్న మరొక సంస్థకు కు 21 లక్షల షేర్లు ఉండడం, వీరు ఆరంభించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి వరంగల్లో ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ వెళ్లడం ఆసక్తి రేపుతోంది.
రేవంత్ అల్లుడి కుటుంబంపై ఇప్పటికే EDలో వివిధ అంశాల్లో కేసులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా ED గొలుగూరి రామకృష్ణను నిందితుడిగా చేర్చి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణానికి పాల్పడ్డారని, ఈ నిధులను కుటుంబ సభ్యులకు, వ్యాపారాలకు తరలించారని ఈడి గతంలో పేర్కొన్నది.
గోలుగూరి రామకృష్ణ,గొలుగూరి వెంకట్ రెడ్డి ఇద్దరూ సోదరులే కాకుండా చాలా కంపెనీల్లో డైరెక్టర్ గా వ్యాపారాలు చేస్తున్నారు. వీరి అబ్బాయి గొలుగూరి వెంకట్ రెడ్డి, Maxbien ఫార్మా డైరెక్టర్ గా ఉన్నారు. ఈడీ పేర్కొన్నట్టు కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఈ కంపెనీలోకి కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నది. గొలుగూరి కుటుంబ సభ్యులపై ఇప్పటికే ఎన్నో బ్యాంక్ ఎగవేత కేసులు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈడీ… రేవంత్ అల్లుడు Maxbien ఫార్మ ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ చేపట్టాలని, పూర్తి ఆధారాలతో సహా సమర్పించారు. గొలుగూరి కుటుంబంపై కేసులు Maxbien ఫార్మా లో సీఎం రేవంత్ అల్లుడు గొలుగూరి సత్యనారాయణ వాటా యొక్క అన్ని ఆధారాలను జతచేసి ఫిర్యాదు చేయడం జరిగింది. క్రిశాంక్ ఇచ్చిన ఫిర్యాదును ఈడీ స్వీకరించింది.