తెలంగాణలో విద్యుత్ విభాగం ప్రగతిపై కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చించారు. విద్యుత్ శాఖలో తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న మార్పులు, భవిష్యత్ పరిణామాల గురించి వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల & కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం తరఫున ఉప ముఖ్య మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషరఫ్ ఫరూఖి, ఈ సమావేశానికి హాజరయ్యారు.
అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమైన ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రానికి సంబంధించిన వివిధ విద్యుత్ సంబంధిత అంశాలపై చర్చించారు.