కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 15వ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా సంజయ్ ని నియమించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం కాగ్ గా కొనసాగుతున్న గిరీష్ చంద్ర ముర్ము పదవీకాలం పూర్తవ్వడంతో సంజయ్ మూర్తిని ఆ పదవిలో నియమించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన సంజయ్ మూర్తి 1989లో హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఆయన ఎంపికయ్యారు. కాగ్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి సంజయ్ మూర్తి. సంజయ్ మూర్తి తండ్రి కేఎస్ఎన్ మూర్తి కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర సర్వీసుల్లో సేవలు అందించారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు.
- Advertisement with us -