ప్రైవేటు డిగ్రీ, ఇంటర్ కళాశాలలకు సంబంధించిన వివిధ సమస్యల పట్ల ప్రభుత్వానికి అవగాహన ఉందని, సానుకూలంగా స్పందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ప్రైవేటు కళాశాలల యజమానుల సంఘం సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. కళాశాలల సమస్యలు దశల వారిగా పరిష్కరిస్తామని తెలిపారు.