డిప్యూటీ సీయంకు మాజీ ఎంపీ ఉండవల్ల లేఖ
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చకు కూటమి ఎంపీలతో నోటీసులు ఇప్పించాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ కుమార్ మంగళవార ఒక లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి తాను అనేక వేదికల మీద ఆంధ్ర్రప్రదేశ్కు జరిగిన అన్యాయన్ని వివరిస్తూనే ఉన్నానని, అప్పటి నుంచీ ముఖ్యమంత్రులను, ప్రముఖులను కలిసి, లేఖల ద్వారా కూడా విభజన జరిగిన తీరు మనకు జరిగిన అన్యాయాన్ని వాళ్లు దృష్టికి తీసుకు వెళ్లానని కానీ ఎందుకో పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చను లేవనెత్తలేక పోయారని ఉండవల్లి డిప్యూటీ సీయంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. నాడు విభజన బిల్లుపై ఏ విధమైన చర్చా జరగకుండా, అందర్నీ బయటకు పంపించి వేసి, టీవీ ప్రసారాలు నిలిపివేసి పార్లమెంటు తలుపులు మీసి వేసి రాష్ట్ర విభజన చేసిన విషయాన్ని మీకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతంలో వివరించినట్లు ఆలేఖలో గుర్తు చేశారు. 2018లో స్వయంగా మీ ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏపీకి రావల్సిన బకాయిలు 74,542 కోట్లుగా తేల్చిందని తెలిపారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలే వివిధ సందర్భాల్లో అలు లోక్ సభ, ఇటు రాజ్యసభల్లో విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించినట్లు పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో ఉండవల్ల వివరించారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల్లో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఉభయ సభల్లో ఏపీ విభజనపై చర్చజరగడానికి మీ ఎంపీల ద్వారా నోటీసులు ఇప్పించాలని, అలాగే సుప్రీంకోర్టులో పదేళ్ళుగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతి ఒక కొలిక్కి తీసుకురావాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆలేఖలో ఉండవల్లి కోరారు.