జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన మార్క్ చూపించారు. ఎన్నికల సమయంలోనే స్టార్ క్యాంపెయినర్‌గా పలు నియోజకవర్గాల్లో భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు. జనంతో మమేకమయ్యారు. ఓటర్లతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. రిమోట్ ఏరియాల్లో కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఏదో మీటింగ్‌లో మాట్లాడామా?, సందేశమిచ్చామా? అన్నట్లు కాకుండా.. ఓటర్లతో స్వయంగా మాట్లాడి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. జార్ఖండ్‌లో ఎన్టీఏను ఎందుకు ఓడించాలో వివరించారు. ఇండియా కూటమి వస్తే జార్ఖండ్‌కు ఎలా లాభమో కూడా వాళ్లకు అర్థమయ్యేలా వివరించారు.
స్టార్ క్యాంపెయినర్‌గా తన ప్రచారం ముగిసిన తర్వాత తెలంగాణకు తిరుగు పయనం అయ్యాక కూడా మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమి విజయంపై ధీమా వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో జెండా ఎగురవేస్తామని చెప్పారు. అక్కడి ఓటర్ల నాడిని పసిగట్టి నమ్మకంగా ఇండియా కూటమి విజయంపై జార్ఖండ్ నేతలకు కూడా భరోసా కల్పించారు. భట్టి అభిప్రాయపడినట్లుగానే ఇప్పుడు జార్ఖండ్ ఫలితాలు వెలువడుతుండటం ఇండియా కూటమిలో.. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది.
ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. అయితే, కాంగ్రెస్ అధిష్టానం నిన్ననే జార్ఖండ్ ఫలితాల పరిశీలకులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను నియమించింది. దీంతో, హుటాహుటిన భట్టి విక్రమార్క జార్ఖండ్ బయలు దేరి వెళ్లారు. అక్కడ తోటి పరిశీలకులు, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనాయకులతో కలిసి వ్యూహాలు రచిస్తున్నారు.