37.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

తెలుగు లోగిళ్లలో భోగి పండుగ సందడి

సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈ పండుగలో మొదటి రోజున వచ్చేది ‘భోగి’ పండుగ. భోగి అంటే ‘తొలినాడు’ అనే అర్ధం ఉంది. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్య్ర దేవతను తరిమినట్లేనని నమ్మకం. భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారు జామున భోగిమంటలు వేయటం సాయంత్రం భోగిపండ్లు పోయించుకోవడంతో పిల్లలు హుషారుగా ఉంటారు. ‘భగ’ అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని చెబుతారు. ‘భగ’ అంటే ‘మంటలు’ లేదా ‘వేడి’ ని పుట్టించడం అని అర్ధం.

భోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలో అరిసెలు నువ్వుల లడ్డు, జంతికలు, సకినాలు, చక్కలతో పాటు రకరకాల పిండి వంటలతో మన ఇరు రాష్ట్రాలలోని తెలుగు వారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో మూడు రోజుల పెద్ద పండుగ ప్రారంభం అవుతుంది.

భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు పోస్తూ చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినిగా భావిస్తారు. రేగిపళ్ళను సంస్కృతంలో బదరీఫలం అంటారు. భోగిపళ్ళలో చేమంతి బంతి పూరేకలు అక్షింతలు చిల్లర నాణేలు కలిపి పిల్లల తలపై పోస్తారు. ‘భుగ్’ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం పూర్వం ఈరోజున శ్రీ రంగనాధ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగిపండగ ఆచరణలోకి వచ్చిందని పురాణ గాధ.

అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడంతో విడుదలయ్యే గాలి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. భోగి మంటల నుంచి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

ఇక ఆధ్యాత్మిక పరంగా భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు మనలోని పనికి రాని అలవాట్లు చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి అనే అర్ధం ఈ భోగి మంటల వెనుక ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com