27.7 C
Hyderabad
Tuesday, May 26, 2026

Live Video

spot_img

షమీ రీఎంట్రీ డౌటేనా?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో మహ్మద్‌ షమీ ఆడతాడా? లేదా? అనే అనుమానం ఇంకా అభిమానులను వెంటాడుతోంది. అయితే షమీ ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కే చాన్స్ లేనట్టే కనిపిస్తోంది. చాలా మంది షమీ మళ్లీ టీమ్ ఇండియాతో జాయిన్ అవుతాడని అనుకున్నారు. షమీ కూడా తన ఫిట్‌నెస్‌ను ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడన్న ప్రచారం జరిగింది. కానీ అతను పూర్తి ఫిట్‌గా లేడని తెలుస్తోంది ఇప్పుడు. ఐదు రోజుల పాటు జరిగే టెస్ట్ మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడా? లేదా? అనేది చూసేందుకు షమీకి మరో టెస్ట్‌ పెట్టనున్నారు. చిన్నస్వామి స్టేడియం వేదికగా బరోడా-బెంగాల్ జట్ల మధ్య జరగనున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో షమీ ఆడబోతున్నాడని తెలుస్తోంది. ఇక్కడే మరోసారి అతడి ఫిట్‌నెస్, మోకాలి సమస్యలను పరీక్షించనున్నట్టు సమాచారం.

బెంగాల్ జట్టు తరపున టీ20ఫార్మాట్ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు షమీ మోకాలి వాపు సమస్యలను ఫేస్‌ చేశాడని తెలుస్తోంది. మరి టెస్ట్ ఫార్మాట్‌లో చాలా ఓవర్స్‌ వేయాల్సి ఉంటుంది కాబట్టి మేనేజ్‌మెంట్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత బెంగాల్ జట్టు తరపున షమీ ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీలో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో బెంగాల్‌ తరపున ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా ఫర్వాలేదనిపించాడు.

మరోవైపు టీమిండియా క్యాప్టెన్ రోహిత్‌ శర్మ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాడు. షమీ 100 పర్సెంట్ ఫిట్‌గా ఉంటే తప్ప అతడిని తిరిగి జట్టులోకి తీసుకురావాలని తాను కోరుకోవడం లేదన్నాడు. షమీ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎల్లప్పుడూ డోర్లు తెరిచే ఉంటాయి.. కానీ ఫీట్‌గా ఉండాలన్నాడు. నిజానికి షమీ ప్రస్తుతం దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మరో పోరుకు సిద్ధమయ్యాడు. చండీగఢ్‌తో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆల్‌రౌండ్‌ మెరుపులతో షమీ బెంగాల్‌ టీమ్‌ విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు. సర్జరీ తర్వాత అతని స్టాటస్టిక్స్‌ చూస్తే దేశవాళీల్లో 64 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. ఇందులో 16 వికెట్లు పడగొట్టాడు. ముస్తాక్‌ అలీ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్‌ అతడికి మరో చాన్స్ అనే చెప్పాలి. ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే ఆసీస్‌ పిచ్‌లపై దుమ్ము రేపేందుకు చాన్స్ దక్కుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com