28.2 C
Hyderabad
Friday, August 14, 2026

Live Video

spot_img

100 ఫార్మాసిస్ట్‌ పోస్టులకు జాబ్‌ మేళా

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీకి అవసరమైన పోస్టులకు ఈ నెల 26 న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా జరుగుతుంది. అపోలో ఫార్మసీ లోని ఫార్మాసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ లకు చెందిన 100 పోస్టులను ఈ జాబ్‌మేళా ద్వారా భర్తీ చేస్తారు. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డిగ్రీ చేసిన 18 నుండి 35 సంవత్సరాల వయసు వారికి ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలియజేసింది. రూ.14 ,800 నుండి రూ.25 వేలవరకు వేతనం చెల్లిస్తారని వివరించింది. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో వద్ద నేరుగా నవంబర్ 26 న హాజరు కావాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com